ఒక్క కార్మికుడికి కరోనా.. 533 మందికి అంటించాడు.. ఎక్కడో తెలుసా?
కరోనా వైరస్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అంతే సంగతులు అనేందుకు ఈ ఘటనే నిదర్శనం. తాజాగా ఘనాలోని అట్లాంటిక్ సముద్రతీర నగరమైన తేమాలోని ఒక చేపల ప్రాసెసింగ్ కర్మాగారంలో పనిచేసే కార్మికుడి నుంచి ఏకంగా 533 మంది ఇతర కార్మికులకు కరోనా వైరస్ సోకింది.
ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశాధ్యక్షుడు నానా అకుఫో అడో తెలిపారు. ఆ ఒక్కడి నుంచి ఇన్ని వందల మందికి కరోనా ఎలా సోకిందనేది మాత్రం అంతు చిక్కడం లేదని అధికారులు వాపోతున్నారు.
ఘనా దేశంలో ఇప్పటివరకు నమోదు అయిన కేసుల్లో ఈ ఘటన కేసులు ఏకంగా 11.3శాతం ఉండడం గమనార్హం. అలాగే.. దేశంలో ఇప్పటివరకు 160,501 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఘనా అధ్యక్షుడు తెలిపారు. ఇక ఇప్పటివరకు కరోనా బారి నుంచి 22మంది మరణించగా.. 492 మంది కోలుకున్నారని చెప్పారు.